అన్నదాన కార్యక్రమం

అన్నదాన కార్యక్రమం విజయవంతం

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కొత్తపేటలో ఉన్న నిరాశ్రయుల ఆవాస కేంద్రం, గొట్లూరు గ్రామంలోని అనాథాశ్రమం, అలాగే ధర్మవరం రైల్వే స్టేషన్ పరిసరాల్లో హ్యూమన్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (HRECI) ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

హ్యూమన్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఈదుర పద్మాకర్, జాతీయ ఉపాధ్యక్షులు ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివకృష్ణ వారి మార్గదర్శకత్వంలో, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు గుర్రంపాటి అశోక్ కుమార్, కోటి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుభహాన్, దాదు వారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిరాశ్రయులు, అనాథలు మరియు అవసరమైన వారికి ప్రేమతో భోజనాన్ని అందించి, మానవత్వాన్ని చాటే సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రామాయణం హరీష్, లక్ష్మీనాయక్, సాయి తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.