గూడూరు పట్టణం, శ్రీ సాయి రామ్ వృద్ధాశ్రం

మానవ సేవయే మాధవ సేవ… పుట్టినరోజును సేవా దినోత్సవంగా మార్చిన కుటుంబం

గూడూరు (ప్రభ న్యూస్) జూలై 20

నేటి కాలంలో పుట్టినరోజులు కేక్ కట్ చేయడం, వేడుకలు నిర్వహించుకోవడం వరకే పరిమితమవుతున్నాయి. అయితే సమాజానికి ఉపయోగపడేలా, ఆకలితో ఉన్న వారి ముఖాల్లో చిరునవ్వులు నింపే సంకల్పంతో శ్రీమతి తోకల రేవతి గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు గూడూరు పట్టణం లో గల శ్రీ సాయి రామ్ వృద్ధాశ్రం లో 50 ఆశ్రయార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ అఫ్ ఇండియా సంస్థ ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్ ఈదురు పద్మాకర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించి ఆదర్శంగా నిలిచారు.ఈ కార్యక్రమం లో హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ అఫ్ ఇండియా నెల్లూరు జిల్లా ప్రసిడెంట్ వెంకటశ్రీనివాస్,గారు జాయింట్ సెక్రటరీ సురేష్ గారు, మంజుల వైస్ ప్రసిడెంట్ (ఉమెన్స్ వింగ్ )కిరణ్ చక్రవర్తి జనరల్ సెక్రటరీ,నెల్లూరు జిల్లా కన్వినర్ వై రమణయ్య గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినారు,ఈ సందర్బంగా కన్వీనర్ రమణయ్య గారు మాట్లాడుతూ, ప్రజలు తమ పుట్టినరోజు కార్యక్రమాలు తమ ఇంటికే పరిమితం మై జరుపుకుంటున్నారు, ఇలా పదిమంది పేద వారి వారితో జరుపుకోవడం చాలా సంతోకరమైన విషయం, తెలిపినారు