ప్రెస్ నోట్
కర్నూలు, ఆంధ్రప్రదేశ్
తేదీ: 23-06-2026
హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (HRECI) ప్రధాన కార్యాలయం కర్నూలులో, కుటుంబ వివాదానికి సఖ్యతా పరిష్కారం:
కర్నూలు జిల్లా, కర్నూలు మండలం, జోలపురం గ్రామానికి చెందిన శ్రీ ఆడికే రాజు, శ్రీమతి జయంతి దంపతుల మధ్య గత సంవత్సరం నుండి కొనసాగుతున్న కుటుంబ విభేదాల నేపథ్యంలో, హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (HRECI) జాతీయ చైర్మన్ శ్రీ ఈదురు పద్మాకర్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
శ్రీ ఈదురు పద్మాకర్ గారి ఆహ్వానం మేరకు దంపతులు, వారి కుటుంబ పెద్దలు మరియు బంధువులు కర్నూలులోని HRECI ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు. అక్కడ అందరి సమక్షంలో సుదీర్ఘంగా చర్చలు నిర్వహించి, కుటుంబ విలువలు, పరస్పర గౌరవం, పిల్లల భవిష్యత్తు మరియు దాంపత్య బంధం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
చర్చల అనంతరం ఇరు వర్గాలు పరస్పర అవగాహనతో రాజీకి వచ్చి, భవిష్యత్తులో ఎలాంటి విభేదాలకు తావివ్వకుండా తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి సంతోషంగా జీవించాలని నిర్ణయించుకున్నారూ.
ఈ దంపతులకు ఐదేళ్ల పెద్ద కుమార్తె, మూడేళ్ల చిన్న కుమార్తె ఉన్నారు. వారి శ్రేయస్సు మరియు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుటుంబ పెద్దల సమక్షంలో దంపతులు కలిసి జీవించేందుకు అంగీకరించారు.
ఈ సందర్భంగా HRECI జాతీయ చైర్మన్ శ్రీ ఈదురు పద్మాకర్ గారు మాట్లాడుతూ, కుటుంబ సమస్యలను సంభాషణ, సహనం మరియు పెద్దల మార్గదర్శకత్వంతో పరిష్కరించుకోవడం ద్వారా కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుందని, పిల్లలకు ప్రేమతో కూడిన సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.
కర్నూలులోని HRECI ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సఖ్యతా సమావేశం విజయవంతంగా ముగియడంతో, సమస్య పూర్తిగా పరిష్కారమైందని ఇరు కుటుంబాలు ప్రకటించాయి. దంపతులు తమ పిల్లలతో కలిసి ఆనందంగా, ఐక్యంగా జీవించాలని సమావేశంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు మరియు పెద్దలు ఆకాంక్షించారు
ఈరోజు అనగా తేదీ 16 మే 2026 శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నరసన్నపేట విచ్చేయుచున్న సందర్భంగా గౌరవ శ్రీకాకుళం జిల్లా s p కే .వీ .మహేశ్వర రెడ్డి గారు పోలీస్ బందోబస్తును చాలా ప్రతిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మండుటెండలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు విధులు నిర్వహిస్తుండగ HUMAN RIGHTS ENFORCEMENT COUNCIL OF INDIA (H.R.E.C.I ) నేషనల్ చైర్మన్ ఈదురు పద్మాకర్ గారి సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల INCHARGE CHAIRMAN డాక్టర్ కె . చిన్నవాడు గారు ఆధ్వర్యంలో పోలీసులకు తమవంతుగా మంచినీరు బాటిల్స్ అందించడం జరిగినది ఈ బాటిల్స్ ను నరసన్నపేట ఎస్సై B . గణేష్ గారి సమక్షంలో పోలీసు వారికి HUMAN RIGHTS ENFORCEMENT COUNCIL OF INDIA (HRECI) తరఫున అప్పజెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కన్వీనర్లు మొయ్యి జగన్నాథం గారు, పంగ శివయ్య గారు తలసముద్రం రాజారావు మొదలగు వారు పాల్గొన్నారు.
ఉదార స్వభావాన్ని చాటుకున్న HRECI.
ఉదార స్వభావాన్ని చాటుకున్న HRECI.




























