80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భమున శ్రీ వెంకటేశ్వర స్కూల్ ప్యాపిలి
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్యాపిలి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్కూల్ నందు విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు అందజేయడం జరిగింది.
ఈ సేవా కార్యక్రమం నేషనల్ చైర్మన్ శ్రీ ఈదుల పద్మాకర్ గారి నాయకత్వంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీ అగ్గి మద్దిలేటి గారు, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు శ్రీ బండి రమేష్ బాబు గారు, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ మధు గారు, ఉపాధ్యాయులు, శ్రీ పుల్లాసి దస్తగిరి గారు, శ్రీ నడిగడ్డ నాగేంద్ర గారు పాల్గొన్నారు.
విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేసి, వారి విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం జరిగింది.







