హెచ్.ఆర్.ఇ.సి.ఐ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హెచ్.ఆర్.ఇ.సి.ఐ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, ధర్మవరం నియోజకవర్గ నిమ్మలకుంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నందు హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.పాఠశాలలోని ఉపాధ్యాయులు,విద్యార్థులు,
విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా హెచ్.ఆర్.ఇ.సి.ఐ శ్రీ సత్య సాయి జిల్లా ప్రెసిడెంట్ కోటి వెంకటేష్ అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ గుర్రంపాటి అశోక్ కుమార్ మరియు ఉమ్మడి జిల్లాల జనరల్ సెక్రెటరీ సుభహాన్ షేక్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతూ ఉత్సాహభరిత వాతావరణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తదుపరి పిల్లలకు పుస్తకాలు,పెన్నులు,విద్య ఉపకరణాలను పిల్లలకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఆర్.ఇ.సి.ఐ శ్రీ సత్య సాయి జిల్లా ప్రెసిడెంట్ కోటి వెంకటేష్, అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ గుర్రంపాటి అశోక్ కుమార్ మరియు ఉమ్మడి జిల్లాల జనరల్ సెక్రెటరీ సుభహాన్ షేక్, ధర్మవరం మండల్ కన్వీనర్ దాదు, శివకుమార్ మరియు ఆర్.వి.డి హరీష్ పాల్గొన్నారు.


